సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ

సికిల్ సెల్ అనీమియా అనేది ఎర్ర రక్త కణాల నమన్య అని తూర్పుగంగవరం పీహెచ్ సి
వైద్యాధికారి డాక్టర్ మౌనిక అన్నారు. పీహెచ్ సి
పరిధిలో సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ సాధారణంగా ఎర్ర రక్త కణాలు గుండ్రంగా మరియు మృధువుగా ఉండి రక్త నాళాల ద్వారా సులభంగా ప్రవహిస్తాయని చెప్పారు. కాని సికెల్ సెల్ అనీమియా వ్యాధి ఉన్న వారికి ఎర్రరక్త కణాలు గట్టిగా గొడ్డలి ఆకారంలో ఉంటాయని, సికిల్ ఆకారపు కణాలు రక్త నాళాలలో చిక్కుకు పోతాయని చెప్పారు. రక్త ప్రవహాన్ని అడ్డుకుంటాయని, దీని వలన నొప్పి ఇతర సమస్యలు వస్తాయని తెలిపారు. వారసత్వం వలన ఈ వ్యాధి వస్తుందని, వ్యాధి లక్షణాలను, నివారణ చర్యలను వివరించారు. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ఐఓ చంద్రశేఖర్ బాబు, పీహెచ్ఎన్ రమణమ్మ, హెచ్ వి
సుశీల , పిహెచ్ఎన్ గోపి నాయక్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *