బొద్దికూరపాడు మోడల్ పాఠశాలలో గురువారం నర్వేపల్లి రాధా క్రిష్ణ విద్యా మిత్ర కిట్స్ ను పంపిణీ చేసారు. ప్రధానోపాధ్యాయుడు కె సుబ్రమణ్యం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసారు. విద్యా కమిటీ చైర్మన్ గుజ్జుల శివా రెడ్డి పాఠశాలను తిరిగి మోడల్ పాఠశాలగా మార్పు చేయటం వలన ఎంతో ఉ పయోగం ఉందని చెప్పారు. విశ్రాంత హెచ్ఎం అంజి రెడ్డి తాను పూర్వ విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా పాఠశాలలో తనకు అనుబంధం ఉందని తిరిగి పాఠశాల అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చెయ్యాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఉపాధ్యాయులు నరసింహా శర్మ, విజయ కుమారి, హరిత, రేవతి దేవి తదితరులు పాల్గొన్నారు.
