భూ సమస్యలతో తల్లికి వందనం ఆగకుండా చూడాలి.

తాళ్లూరు మండలంలో రైతులకు తమకు ఉన్న భూముల కాకుండా అత్యధిక విస్తీర్ణాలు నమోదు అయి తల్లికి వందనం పథకం రాకుండా ఆగినట్లు పలు గ్రామాలలో ఫిర్యాదు ఉన్నాయని వాటిని తక్షణం పరిష్కరించటానికి ప్రత్యేక సర్వేయర్ల బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ సంజీవ రావు తెలిపారు. స్థానిక రెవిన్యూ కార్యాలయంలో గురువారం సర్వేయర్లు, విఆర్ఓ ల సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా భూములు రీసర్వే నిర్వహించిన పలు గ్రామాలలో జాయింట్ ఎల్ పీఎం కారణంగా భూములు విస్తీర్ణాలు ఎక్కువ చూపిస్తున్నట్లు చెబుతున్నారని చెప్పారు. సర్వేయర్ బృందాలు ఆయా గ్రామాలలో పర్యటించి సమస్యను రెండు రోజులలో పరిష్కరించి తల్లికి వందనం తిరిగి అర్హలైన తల్లులకు వచ్చేలా చూడాలని సూచించారు. శివరామపురంలో 14, దోసకాయలపాడులో 11 వరకు అత్యధిక సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్లు ప్రశాంత్ , ఫణీంధ్ర, ఆర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *