జిల్లాలో భూ సమస్యలతో పాటు వివిధ సర్టిఫికెట్స్ కొరకు వచ్చే అర్జీలపై రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరం పరిష్కరింఛి రెవెన్యు శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
రెవెన్యూ అధికారులకు సూచించారు.
శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో జరిగిన రెవెన్యూ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించి, రెవెన్యూ అధికారులతో కలసి కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ… రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, రెవెన్యూ శాఖ కు పని అప్పగిస్తే పని అయిపోతుందని, ఎలా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ ఇతర శాఖలకు ఆదర్శంగా ఉందని, రానున్న రోజుల్లో కుడా ఇతర శాఖలకు రెవెన్యూ శాఖ ఆదర్శంగా నిలవాలన్నారు. వివిధ భూ సమస్యలపై, సర్టిఫికెట్స్ కొరకు పేద ప్రజలు రెవెన్యూ కార్యాలయాలకు అర్జీలతో వస్తుంటారని, క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు వారి సమస్యలను సావదానంగా విని సత్వరం పరిష్కరించేలా రెవెన్యూ అధికారులు పనిచేసినప్పుడే ప్రజల్లో రెవెన్యూ శాఖపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. భూ సమస్యలతో పాటు వివిధ సర్టిఫికెట్స్ కొరకు వచ్చే అర్జీ లపై రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరం పరిష్కరింఛి రెవెన్యు శాఖకు మంచి తీసుకురావాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా రెవెన్యూశాఖలో ఉత్తమ సేవలందించిన రెవెన్యూ ఉద్యోగులను, పదవీ విరమణ చెందిన ఉద్యోగులను జిల్లా కలెక్టర్ సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ కు సంబంధించి బుక్స్, రికార్డ్స్ తో ఏర్పాటు చేసిన స్టాల్ ను జిల్లా కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు.
రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.
తొలుత రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని మినీ స్టేడియం నుండి ఏర్పాటు చేసిన ర్యాలీ ని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మినీ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు కొనసాగింది.
రెవెన్యూ దినోత్సవ వేడుకల్లో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్, జాన్సన్, పార్థసారథి, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



