“సబ్ డివిజన్” డ్రైవ్‌ను ప్రారంభం – జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల క్రిష్ణ

సంయుక్తంగా భూమిని కలిగి ఉన్న రైతులకు వ్యక్తిగత హక్కులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఈ చర్యలలో భాగంగా ప్రకాశం జిల్లాలో జాయింట్ పట్టాదారుల భూములను వ్యక్తిగత హక్కుగా విభజించేందుకు “సబ్ డివిజన్” డ్రైవ్‌ను ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల క్రిష్ణ
ఒక ప్రకటనలో తెలిపారు. జాయింట్ హక్కుదారులుగా ఉన్న భూములపై తరచూ వివాదాలు, రిజిస్ట్రేషన్ సమస్యలు, పథకాల లబ్ధిలో అడ్డంకులు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత సంవత్సరంలో అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో నిర్వహించిన గ్రామసభలలో వచ్చిన అర్జీలను పరిశీలించి, కొన్ని జాయింట్ ఎల్పీయంలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. జనవరి 2025లో సబ్ డివిజన్ అప్లికేషన్ రుసుమును రూ. 500 నుండి కేవలం రూ. 50 కనిష్ఠ సేవా ఛార్జీగా తగ్గించడం జరిగిందన్నారు.ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 298 గ్రామాల్లో ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ఈ డ్రైవ్‌ను జూన్ 30వ తేదీ లోగా పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులకు సూచించడమేకాక, రూ. 50 కనిష్ఠ సేవా ఛార్జీ కూడా అదే తేదీ వరకు మాత్రమే వర్తించనుంది. అందువల్ల రైతులు జూన్ 30వ తేదీ లోగా తమ సంయుక్త భూములపై వ్యక్తిగత హక్కుల కోసం అవసరమైన దరఖాస్తులు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ సబ్ డివిజన్ డ్రైవ్ ద్వారా రైతులు తమ భూమిపై పూర్తి హక్కుతో వ్యవహరించగలుగుతారు, ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందగలుగుతారు, రిజిస్ట్రేషన్, రుణాలు పొందడం వంటి కార్యకలాపాల్లో సులభతరం అవుతుంది. ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం జాయింట్ పట్టాదారులకు స్పష్టమైన వ్యక్తిగత హక్కులు కల్పించడం. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ సంయుక్త భూములపై వ్యక్తిగత హక్కుల కోసం సంబంధిత రెవెన్యూ కార్యాలయాలను సంప్రదించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *