హైదరాబాద్ జూన్ 20(జే ఎస్ డి ఎం న్యూస్) :
వెన్నెముక ఎముకలు, జాయింట్లు, నరాలు, కండరాలు, లిగమెంట్లు మరియు ఇంటర్‌వర్టీబ్రల్ డిస్కులతో కూడి ఉంటుంది. శరీరంపై భాగాన్ని మోయడం, వంగడం మరియు తిరగడం వంటి క్లిష్టమైన పనులను ఇది నిర్వహిస్తుంది.
మెడ (సర్వికల్) మరియు నడుము (లంబార్) వెన్నెముకలు అత్యంత చురుకైన భాగాలు.
సాధారణ వెన్నెముక సంబంధిత సమస్యలు.
తక్కువ నడుము నొప్పి, కండరాల అలసట లేదా ఒత్తిడి వల్ల ఏర్పడుతుంది. మెడ నొప్పి – కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే కండరాల ఒత్తిడి లేదా అలసట.
సైయాటికా – మెడ లేదా నడుము నుండి కాలు వరకు నరంపై ఒత్తిడివల్ల నొప్పి. స్పాండిలోలిస్తెసిస్ – వెన్నెముక ఎముకలు జారిపోవడం.
ఇన్‌ఫెక్షన్ – ఇండియాలో ప్రత్యేకించి క్షయవ్యాధి (ట్యూబర్‌కులోసిస్) ద్వారా వెన్నెముకలో ఇన్‌ఫెక్షన్లు సమస్యలతో బాధపడుతున్నారు.
కారణాలు.. కూర్చునే స్థితి – పనివేచేసే సమయంలో సరైన భంగిమలో లేకపోవడం. వ్యాయామ లోపం – బలహీనమైన కండరాలు, ఎముకలు, లిగమెంట్లు, జాయింట్లు. అధిక బరువు – వెన్నెముక, కండరాలు మరియు జాయింట్లపై అధిక ఒత్తిడి. ధూమపానం మరియు మద్యం – వెన్నెముక మరియు డిస్కుల్లో డిజెనరేటివ్ మార్పులు. మానసిక ఒత్తిడి – హార్మోనల్ మార్పుల వల్ల నొప్పి కలిగించే పరిస్థితులు.
నివారణ చర్యలు:
నియమిత వ్యాయామం – కండరాలు, లిగమెంట్లు, జాయింట్లు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. సరైన కూర్చునే స్థితి – డెస్క్ ముందు వంగకుండా కూర్చోవడం, నడుస్తూ భంగిమను కాపాడుకోవడం. బరువు నియంత్రణ – వెన్నెముకపై అధిక ఒత్తిడిని నివారించేందుకు. తగిన నీటి సేవనం – డిస్కులు తేమగా ఉండేందుకు. ధూమపానం మానడం, ముందస్తు నష్టం నుండి కాపాడుతుంది. బరువైన వస్తువులు లేపేటప్పుడు జాగ్రత్త,మోకాళ్లను వంచి, వెన్నెముకను వంగకుండా లేపాలి.
నిపుణుడిని ఎప్పుడుసంప్రదించాలి:
2–3 వారాల పాటు నొప్పి కొనసాగితే కాలుయొక్క లేదా చేతుల యొక్క నరాల్లో నొప్పి ఉంటే చేతులు లేదా కాళ్ళలో బలహీనత ఉంటే దీర్ఘకాలిక జ్వరాలకు దారితీస్తుంది. పైన పేర్కొన్న సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే నిపుణులైన వైన్ సర్జన్ ను సందర్శించాలి. ప్రతి శనివారం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ బేగంపేట్ కు చెందిన ప్రముఖ కన్సల్టెంట్ స్ప్రైయిన్ సర్జన్ డా. డి. ఆంజనేయులు రెడ్డి మహబూబ్ నగర్ లోని కార్తీక్ న్యూరో సెంటర్ ను సందర్శించి సలహాలు సూచనలు అందజేస్తారు. ఇతర వివరాల కోసం 9705610143 నంబర్లో సంప్రదించవచ్చు.
