ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సిఐ పాండురంగారావు మరియు వారి సిబ్బంది మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 35 మంది మైనర్లు నడుపుతున్న ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద మైనర్లు, వారి తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడపరాదని ఇటు మైనర్లకు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. ప్రేమ, గారాబం ప్రాణాలు కంటే మించినవేమీ కాదని గుర్తుంచుకోవాలన్నారు. మైనర్లు వాహనం నడపటం చట్ట విరుద్ధమన్నారు. పిల్లల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ నడిపేందుకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ , సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని అతి వేగంగా వాహనాలు నడపరాదని,మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయరాదని, మద్యం సేవించి వాహన నడపరాదన్నారు.
ఈ కౌన్సిలింగ్ లో ట్రాఫిక్ ఎస్సైలు కోటయ్య, ఆర్ ఎస్సై మాల్యాద్రి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

