పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించడంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ
పేర్కొన్నారు.
బిఎల్ఓ యాప్ నిర్వహణ, ఓటర్ జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ తదితర అంశాలకు సంబంధించి ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్సకాలపై మంగళవారం ఒంగోలు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఈఆర్ఓ లు, ఎఈఆర్ఓ లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ పాల్గొని మాట్లాడుతూ… కేంద్ర ఎన్నికల సంఘం జారి చేసిన మార్గదర్సకాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని క్షేత్ర స్థాయిలో బిఎల్ఓలకు అవగాహన కల్పించడంతో పాటు ఓటర్ జాబితా రూపకల్పన, బిఎల్ఓ యాప్ నిర్వహణ, రేషనలైజేషన్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కచితంగా అమలు జరిగేలా ఈఆర్ఓ లు, ఎఈఆర్ఓ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
తొలుత బిఎల్ఓ యాప్ నిర్వహణ, ఓటర్ జాబితా రూపకల్పన మరియు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈఆర్ఓ లకు, ఎఈఆర్ఓ లకు అవగాహన కల్పించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్దిఒ లు లక్ష్మిప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, ఈఆర్ఓ లు కుమార్, సత్యనారాయణ , జిల్లా లోని ఎఈఆర్ఓ లు తదితరులు పాల్గొన్నారు.

