అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల సాగు చేసిన పంటలు నష్టపోయినా రైతులకు
ఆర్థిక సహాయం అందించుట కొరకు ఖరీఫ్లో సాగు చేసిన పంటలకు ప్రధాన మంత్రి ఫనల్ భీమా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. మండలంలోని విఠలాపురం, మాధవరం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. వరికి ఎకరానికి రూ.860లు కాగా ఆగష్టు 15 వరకు గడువు ఉందని చెప్పారు. కంది పంటకు రూ.430, నజ్జ రూ.156, మిరప రూ. 4.500. మినుములు రూ. 205, నువ్వులు రూ.180లు కాగా జులై 31వ తేది వరకు గడువు ఉందని తెలిపారు. బ్యాంకులో పంట రుణం తీసుకున్నప్పుడు భీమా ప్రీమియం కట్టించుకుంటారని, బ్యాంకు రుణం పొందని వారు, కౌలు దారులు కామన్ నర్వీన్ సెంటర్ ద్వారా నగదు చెల్లించి పంటల భీమా చేయించుకోవాలని తెలిపారు. విఏఏ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
