పర్యావరణ పరిరక్షణను చిన నాటి నుండే అలవరచుకోవాలని టిడిపి ప్రకాశం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ అన్నారు. చంద్రన్న పచ్చదనం కార్యక్రమంలో బాగంగా మంగళవారం తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దర్శినియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ ఆదేశాలతో, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెం నాయుడు ఆశీస్సులతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పరిటాల తెలిపారు. పచ్చదనం, పర్యావరణ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున ఒక మొక్క నాటాలని వక్తలు నూచించారు. హెడ్ మాస్టర్ వైఎన్ ఆర్కి ప్రసాద్, నియోజక వర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మీరా మోహినుద్దీన్, శివ, సుబ్బా రావు, శ్రీను, గ్రామస్తులు పాల్గొన్నారు.

