15% వృద్ధిరేటే లక్ష్యంతో వ్యవసాయం మరియు అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలి – అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలి – జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా

జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా ఈ సంవత్సరం 15% వృద్ధిరేటే లక్ష్యంతో వ్యవసాయం మరియు అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని, అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, వ్యవసాయ మరియు దాని అనుబంధ శాఖల అధికారులతో సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాల పురోగతిపై, తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ ఆర్ధిక సంవత్సరంలో వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం సాధించేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకొని అందుకనుగుణంగా లక్ష్య సాధనకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రైతుకు ఖర్చు తగ్గించి, ఉత్పత్తి పెంచేలా తదనుగుణంగా అధిక ఆదాయం పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రైతుల్లో కూడా ఈ విషయాలపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. జిల్లాలో భూసార పరీక్షల్లో భాగంగా 34,293 మట్టి శాంపిల్స్ లక్ష్యంగా కాగా వంద శాతం సాధించడం జరిగిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జిల్లా కలెక్టర్ కు వివరించారు. జిల్లాలో పొలం బడి కార్యక్రమం పటిష్టంగా అమలు జరగాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా లో 46,015 మంది కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు మంజూరు లక్ష్యం కాగ, రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యం మేరకు కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు మంజూరుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. డ్రోన్ వినియోగం ముందు డ్రోన్ వినియోగం తరువాత ఎంత పంట దిగుబడి వచ్చిందో వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నివేదికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ, మార్క్ ఫెడ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన విత్తనాలు, ఎరువులు డిమాండ్ మేరకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, గ్రామస్థాయిలో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సేంద్రియ ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
స్వర్ణాంధ్రలో భాగంగా జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా ప్రణాలికలు రూపొందించి అందుకనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్, పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. పశుగ్రాసం పంపిణీ, పశు భీమా లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా లో 1259 గోకులం షెడ్స్ మంజూరు చేయడం జరిగిందని, అందులో 822 పూర్తీ కావడం జరిగిందని, మిగిలినవి త్వరగా పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్వర్ణాంధ్రలో భాగంగా జిల్లాలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి కి చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబం రిజిస్టర్ అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారి సంక్షేమానికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పట్టుపరిశ్రమ అభివృద్దికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు, పశుసంవర్ధక శాఖ జెడి రవి కుమార్, మత్స్య శాఖ జెడి శ్రీనివాస రావు, ప్రకృతి వ్యవసాయ శాఖ డిపిఎం సుభాషిని, మార్క్ఫెడ్ అధికారి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *