ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి
, జిల్లా కలెక్టర్ల కు సూచించారు.
బుధవారం ఉదయం విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, వర్చువల్ గా అన్నీ జిల్లాల కలెక్టర్ల తో సమావేశమై పిజిఆర్ఎస్ లో వచ్చిన దరఖాస్తుల పెండేన్సి, ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్, వివిధ ప్రభుత్వ సంస్థలకు భూ కేటాయింపు, రీ సర్వే పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ… జిల్లాల్లో ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఇంటిపట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. నివేశన స్థలాల కేటాయింపునకు సంబంధించి అందుబాటులో ఉన్న స్థలాల వివరాల డేటాను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా ల్లో జరుగుచున్న రీ సర్వే ప్రక్రియ పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిజిఆర్ఎస్ లో రెవెన్యూ సమస్యలపై వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో నాణ్యతతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు ఒంగోలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వర కుమార్, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ భాషా, ల్యాండ్ సెక్షన్ సిబ్బంది తదితరులు తదితరులు పాల్గొన్నారు.

