ప్రజా స్వామ్యాన్ని కాపాడటం కోసం రాజీలేని పోరాటం చేసేది జర్నలిస్ట్ లు – ఘనంగా ప్రారంభమైన ఎపీయూడబ్యుజే 36వ రాష్ట్ర మహాసభ ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు రామా నాయుడు, గొట్టిపాటి డోలా, ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, డాక్టర్ ముక్కు , ఆశోక్ రెడ్డి, ఎలూరి సాంబశివ రావు, దర్శి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి, దామచర్ల సత్య లు, తెలంగాణ ప్రెస్ ఆకాడమి చైర్మన్ కె శ్రీనివాస రెడ్డి

ప్రజా స్వామ్యాన్ని కాపాడటంతో రాజీలేని పోరాటం చేసేది జర్నలిస్ట్లు అని నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల రామా నాయుడు అన్నారు. ఒంగోలు విష్ణు ప్రియ కన్వేన్షన్ కేంద్రంలో బుధవారం ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ( ఎపీయూడబ్యుజే ) 36వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమైనాయి. మంత్రులు నిమ్మల రామా నాయుడు, గొట్టి పాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, తెలంగాన ప్రెస్ అకాడమి చైర్మన్ కె శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ఆశోక్ రెడ్డి, ఎలూరి సాంబశివ రావు, దర్శి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి, దామచర్ల సత్య లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎపీయూడబ్యుజె రాష్ట్ర అధ్యక్షుడు ఐవీసుబ్బా రవు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ సమాజంలో అభివృద్ధి కోసం నిత్యం పాటుపడే జర్నలిస్ట్ల సేవలు ఆమోఘమని అన్నారు. దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్వసస్థలు మూడు స్తంభాలు అయితే నాల్గవ స్తంభం పత్రికా రంగం అని అన్నారు.
తాను సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చి ప్రజా సేవ చేస్తున్నానని అదే విధంగా జర్నలిస్ట్లు కూడ నిత్యం సమాజ సేవలో ఉండటం గమనించానని అన్నారు. తాను జర్నలిస్ట్ల సమస్యలు తెలిసిన వాడినని అన్నారు. తనకు ఎదైనా సమస్య వస్తే జర్నలిస్ట్లతో పంచుకుంటే సమస్యకు పరిష్కారం దొరకుతుందని అన్నారు. ప్రజా కంఠక పాలనకు చరమ గీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటంలో సైతం జర్నలిస్ట్ల పాత్ర కీలకమని అన్నారు. టిడిపి ప్రభుత్వం జర్నలిస్ట్ల పట్ల గౌరవం ఉన్న ప్రభుత్వం అని… జర్నలిస్ట్ ల సమస్యలను సంఘ నాయకులు తెలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, పార్థ సారధిలతో చర్చించి తగిన అక్రిడేషన్స్, భీమా, నివాస స్థలాల విషయం నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తాను ఇప్పటికే తన నియోజక వర్గంలోని జర్నలిస్ట్లకు నివాస స్థలాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తమ వృత్తిలో ప్రాణాలను సైతం లెక్కచేయక వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసిన జర్నలిస్ట్లకు ప్రభుత్వం ఎప్పటికి అండగా ఉంటుందని అన్నారు. వారి సమస్యలను తన దృష్టికి వస్తే తక్షణమే పరిష్కరించటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. న్యూస్ వ్రాసే సమయంలో తగిన పూర్తి సమాచారంలో ఇవ్వాలని వ్యూస్ కు తావు ఇవ్వకుండా వ్రాయాలని చెప్పారు. గతంలో ఉన్నటు వంటి భీమాను రద్దు చేయటంతో జర్నలిస్ట్ల ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, పార్ధసారధితో చర్చించి త్వరగా భీమా అమలు అయ్యేలా చూస్తామని చెప్పారు. అప్పటి వరకు తాను జర్నలిస్ట్లకు ఎవైనా ఇబ్బందులు ఉంటే సహకరిస్తానని హమీ ఇచ్చారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ జర్నలిస్ట్లకు మేలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పడూ ముందు ఉంటుందని అన్నారు. కొండెపిలో జర్నలిస్ట్లకు నివాస స్థలాల మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి పత్రికా రంగానికి ఎంతో అనుబంధం ఉందని తాము కూడ పత్రికను నడిపిన అనుభవంతో జర్నలిస్ట్ల సాధక బాధలు తెలుసునని అన్నారు. వారికి అన్ని విధాలుగా సహాయ! సహకారాలు ఎప్పడూ ఉంటాయని అన్నారు. సోషల్ మీడియాను నియత్రణ చేయటం సాధ్యం కాదని కాని స్వతహాగా నియంత్రణ కలిగి మంచి వార్తలను అందించాలని అన్నారు. నేడు గల్లీ నుండి డిల్లీ వరకు జరిగిన వార్తలు క్షణాలలో తెలిసి పోతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ మాట్లాడుతూ ఒంగోలులో జర్నలిస్ట్ల కాలనీ నిర్మాణానికి, తాతగారైన దామచర్ల ఆంజనేయులు పేరిట తన స్వంత నిధులతో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేస్తామని, అందులో ఇతర ప్రాంతాల జర్నలిస్ట్ లు వచ్చినప్పుడు విశ్రాంతి గదులను సైతం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) ప్రెసిడెంట్ కె.శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల వేతన సవరణ చట్టం కార్యరూపం దాల్చలేదని, వేతన సవరణ జరిగి సుమారు 15 సంవత్సరాలు అవుతుందని దీనిపై ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టాలని కోరారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిందని రాబోయే సం వత్సర కాలంలోనైనా పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని కోరారు. మంత్రుల కమిటీ సిఫారసుల మేరకు పాత్రికేయుల అక్రిడిషన్ కార్డుల జారీ కోసం జీ.వో రూపొందినప్పటికీ అది ఇంతవరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదానికి నోచుకోలేదని వచ్చే కేబినెట్ సమావేశంలో ఆ జీ.వోను ఆమోదించేవిధంగా కృ షిచేయాలని సభాధ్యక్షులు, ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు కోరారు.
ముందుగా మంత్రులు ,ఎంపీ, శాసనసభ్యులు యూనియన్ నాయకులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్, డాక్టర్ ఉగ్ర నరసింహా రెడ్డి, ఏలూరి సాంబశివ రావు, ముత్తుముల అశోక్ రెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, దర్శి తెదేపా ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఐజేయు జనరల్ సెక్రటరీ బల్వీందర్ సింగ్ జమ్ము, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్. ఎన్. సిన్హా, జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, ఏపీయుడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.సురేష్, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు,
ఎన్.వి.రమణ, దాసరి కనకయ్య, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు వెంకట్రావు, సరస్వతీ విద్యాసంస్థల అధినేత ఏ.వి. రమణా రెడ్డి, పలువురు యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన యూనియన్ కార్యవర్గ ప్రతినిధులు, పెద్దసంఖ్యలో పాత్రికేయులు పాల్గొని తమ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, పాత్రికేయులు ఆలపించిన సినీగీతాలు, పద్యాలు విశేషంగా అలరించాయి. మహాసభ ప్రారంభానికి ముందు స్థానిక ప్రకాశం భవన్ దగ్గర నుంచి విష్ణుప్రియ కన్వెన్షన్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాత్రికేయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *