రోడ్డు ప్రమాదాలతో దేశ జీడీపీ పైన ప్రభావం..

బేగంపేట జూన్ 26,(జే ఎస్ డి ఎం న్యూస్):
రోడ్డు ప్రమాదాల ప్రభావం దేశ జీడీపీ పైన పడుతుందని,రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ ఐ ఏ ఎస్ అధికారి బి.జనార్ధన్ రెడ్డి అన్నారు.బేగంపేట లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో బుధవారం రోడ్డు భద్రతపై విద్యార్థినులకు నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అన్నారు. ఈ సదస్సులో కళా శాల ప్రిన్సిపాల్ కే.పద్మావతి,అధ్యక్షత వహించగా డా. అన్న షరాన్, డా. పర్వీన్ సుల్తానా విద్యార్థినులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *