శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలకు వచ్చే భక్తులకు వేగంగా దర్శనం కల్పించాలి….ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి…..సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట.

బేగంపేట జూన్ 26(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వేగంగా దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టాలని,మెరుగైన సేవలు అందించాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అధికారులకు సూచించారు. బోనాల పండగ నేపథ్యంలో గురువారం డా. కోట నీలిమ మహంకాళి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజరులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ముందుగా డాక్టర్ కోట నీలిమ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజరులతో మాట్లాడి పూజ విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ ఛైర్మెన్ కామేష్, ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, ఇతర సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల జాతర ఉత్సవాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని పేర్కొన్నారు. మహంకాళి అమ్మవారు అంటే సామాన్యుల అమ్మ అని.. అందుకే అందరికి ఉచిత దర్శనం కల్పిస్తున్నామన్నారు. మహంకాళి అమ్మవారి వద్ద పేద, ధనిక బేధం లేదన్నారు. మహంకాళి బోనాల జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని.వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా దర్శన భాగ్యం కల్పించాలన్నారు. భక్తుల సౌకర్యార్ధం తాగు నీటి వసతి కల్పించాలన్నారు. పాదరక్షల కోసం స్టాండ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.మరోవైపు పోలీస్ అధికారులతో మాట్లాడి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలకు పూనుకోవాలన్నారు.జి హెచ్ ఎం సి అధికారులతో మాట్లాడి శానిటేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. అక్కడి భక్తులతో మాట్లాడి ఆలయంలో ఉన్న వసతులపై అడిగి తెలుసుకున్నారు. తను ఇంచార్జిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.
అనంతరం దేవాలయాన్ని అనుకొని ఉన్న జనరల్ బజారులో పర్యటించారు.
ఈ సందర్భంగా షాపుల యజమానులు భారీ ఎత్తున డాక్టర్ కోట నీలిమకు స్వాగతం పలికారు. అనంతరం ప్రతి షాప్ కు వెళ్లి ఆయా షాప్ యజమానుల సమస్యలని అడిగి తెలుసుకున్నారు. దేవాలయం చుట్టుపక్కల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని. బోనాల నేపథ్యంలో అమ్మవారి జాతరకు సహకరించాలని షాపు యజమానులను కోరారు.డాక్టర్ కోట నీలిమ వెంట సనత్ నగర్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ , పంచముఖి హనుమాన్ టెంపుల్ చైర్మన్ బచ్చు రాజ్ కుమార్ , లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ చైర్మన్ ఈశ్వర్ , వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ మాకు ఎల్లేష్ , సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు మాణిక్యం ప్రభు , డిసిసి సెక్రెటరీ హేమంత్ సింగ్ ఠాకూర్ , శ్రీకాంత్ చారి , వనమాల అనిల్ , రఘు యాదవ్ , రఘు ముదిరాజ్ , వెంకట్ , సురేష్ కైలాష్ , గిరిధర్ , ఈశ్వర్ , సదానంద్ , ఎస్ ఆర్ శివకుమార్ , నారాయణ ముదిరాజ్ , కృష్ణ ముదిరాజ్ , శ్రీనివాస్ ముదిరాజ్ , పాండు గౌడ్ , జగదీష్ కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *