బేగంపేట జూన్ 26(జే ఎస్ డి ఎం న్యూస్):
కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ బేగంపేట్ లో ఆధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఐ కేర్ సెంటర్ ను గురువారం ప్రారంభించారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ వి గురవారెడ్డి, చీఫ్ ప్రసూతి, గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ భవాని, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అత్తమాలజీ డాక్టర్ ఎస్ టి ఎస్ పృధు వ్యాస్ ల నేతృత్వంలో ఈ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏ వీ గురవరెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలను
ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే సంకల్పంతోనే ఆధునిక వైద్య సేవలతో కూడిన ఐ కేర్ సెంటర్ ను బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ లో ప్రారంభించినట్లు తెలిపారు.కంటికి సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని కార్నియా క్యాట్రాక్ట్ రెటీనా గ్లూకోమా వంటి విభాగాలకు చెందిన ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అత్తమాలజీ డాక్టర్ ఎస్ టి ఎస్ పృధు వ్యాస్ తెలిపారు. చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించేందుకు
అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు. నొప్పి బాధ తెలియకుండా నిర్వహించే స్కానింగ్ పరీక్షలు, చూపుకోల్పోకుండా ముందుగానే కనిపెట్టే టెక్నాలజీ, డయాబెటిస్ రెటినోపతిని మొదటి దశలోనే కనిపెట్టి తగిన చికిత్స ఇవ్వడం ద్వారా చూపును నిలబెట్టడం, చిన్నపిల్లల్లో ముఖ్యంగా అంధత్వాన్ని అరికట్టేందుకు అవసరమైన ఆధునిక పరికరాలు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, పిల్లలు మన ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి మయోపియా మాస్టర్ అనే ఆధునిక టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా మొదటి దశలోనే 100% కచ్చితంగా పరిస్థితిని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా సరైన చికిత్స, సరైన సమయంలో ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది అన్నారు. తద్వారా 18 సంవత్సరాలు దాటిన తర్వాత చూపు కోల్పోవడం అనేది ఉండదన్నారు. క్యాట్రాక్ట్ లో ఆధునిక టెక్నాలజీ ద్వారా ఆపరేషన్ అయిన తర్వాత కళ్లద్దాలు పెట్టుకునే అవసరం లేకుండా లెన్స్ ఇంప్లాంట్ పద్ధతి అందుబాటులో ఉందన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఈ ఓ ఓ సుధాకర్ జాదవ్ మాట్లాడుతూ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ లో ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీని అంది పుచ్చు కుంటూ వైద్య సేవలు అందిస్తోందని, ఈ కోవలోనే
ఐ కేర్ సెంటర్ ను అన్ని రకాల వైద్య సేవలతో ప్రారంభించామని తెలిపారు. ఈ వైద్య సేవలను ప్రతి
ఒక్కరూఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలోఆప్తమాలజిస్టులు డాక్టర్ జ్యోతి, డాక్టర్ విష్ణు ప్రీతి తదితరులు పాల్గొన్నారు.

