తాళ్లూరు మండలంలోని బెల్లంకొండ వారి పాలెం ఉత్తమ గ్రీన్ విలేజ్ గా నిలచింది. నేషనల్ లోకల్ గవర్నెన్స్ ఛాంబర్ ఆంధ్ర ప్రదేశ్ గ్రామ స్వరాజ్య సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా మండలంలోని బెల్లం కొండ వారిపాలెం ఈ అవార్డుకు ఎంపిక అయినది. నర్పంచి పోశ సుమలత శ్రీకాంత్ రెడ్డి ఉత్తమ నాయకత్వ సేవా అవార్డును శనివారం జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా చేతుల మీదుగా అందుకున్నారు. సర్పంచిల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు వీర భధ్రా చారి, ఛాంబర్ కన్వినర్ రాము తదితరులు పాల్గొన్నారు.
