జల్ జీవన్ మిషన్ శంకుస్థాపన సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్

ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.1290 కోట్లతో చేపట్టనున్న త్రాగునీటి పథకం శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనడానికి శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్కాపురం విచ్చేసిన సందర్భంగా మార్కాపురం – తర్లుపాడు రోడ్డులో ఏర్పాటు చేసినహెలి పాడ్ వద్ద ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ పూల మొక్కను అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. త్రాగునీటి పథకం శంకుస్థాపన మరియు అనంతర ప్రసంగం పూర్తయ్యిన తర్వాత ఉప ముఖ్యమంత్రి తిరిగి బయలుదేరారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఖరారైన దగ్గర నుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసి, పర్యటన ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకొని బందోబస్తు నిర్వహించడమైనదని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్
తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో పునః సమీక్ష సమావేశమును మార్కాపురం డిఎస్పీ కార్యాలయం వద్ద నిర్వహించారు. బందోబస్తు ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేసినందుకు సభా వేదిక వద్ద విధులు నిర్వహించిన సిబ్బందిని, ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న అధికారులను, మహిళా పోలీసులు, హోంగార్డులు, కమ్యూనికేషన్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తదితర విభాగాల అధికారులను జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. ఒక పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకొని, దానిని క్రమబద్ధంగా అమలు చేస్తే ఎంతటి క్లిష్టమైన కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తి చేయవచ్చు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమైనదని, ప్రతి స్థాయిలో ఉన్న సిబ్బంది సమర్థవంతంగా పనిచేయడం వల్లే ఈ పర్యటనను సజావుగా, ప్రశాంతంగా పూర్తిచేయగలిగాం అని తెలిపారు. పోలీసు శాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో ఉప ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా ముగిసిందని, అందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) నాగేశ్వర రావు, మార్కాపురం డిఎస్పీ నాగరాజు, ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు,దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఏ ఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *