తాళ్లూరు మండలంలోని పాఠశాలలో ఈనెల 10న నిర్వహించతలపెట్టిన మెగా పెరెంట్స్ మీటింగ్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని మండల విద్యాశాఖాధికారి-1 జి సుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర రావులు కోరారు. స్థానిక ఎంఆర్సీ లో శుక్రవారం ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ లు సుబ్బయ్య, సుధాకర్ రావులు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకొనుటకు ప్రత్యేక డ్రైవ్ ను కొనసాగించాలని సూచించారు. సమయం ప్రకారం విద్యార్థులకు హాజరు నమోదు చెయ్యాలని, హాజరు తగ్గినట్లయితే విద్యార్థులకు అమ్మఒడి రాదు అన్న విషయాన్ని తల్లిదండ్రులకు విద్యార్థులకు తెలియజెయ్యాలని కోరారు.
