తాళ్లూరు మండలంలోని మాధవరం, తాళ్లూరు చెత్త సంపద కేంద్రాలను ఒంగోలు డిఎల్పీఓ పద్మ శుక్రవారం పరిశీలించారు. మాధవరంలో చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించి త్వరగా వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరసరాలను పరిశుభ్రంగా ఉంచటంతో పాటు చెత్త సంపద కేంద్రాల నిర్వహణ ద్వారా పంచాయితీలకు ఆదాయ వనరు చేకూరేలా చూడాలని కోరారు. మాధవరం, తాళ్లూరు గ్రామ కార్యదర్శులు అల్లం వెంకటేశ్వర్లు, ఇడమకంటి వెంకట రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు
