వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా తాళ్లూరు మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డిని నియమిస్తూ ఆపార్టీ అధ్యక్షుడు వైఎన్ జగన్మోహన్ రెడ్డి శనివారం ప్రకటించినట్లు ఆపార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం ప్రకటించినది. పోశం మధుసూధన రెడ్డి తాళ్లూరు ఎంపీపీగా, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా గతంలో పనిచేసారు. పార్టీ అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషి ని గుర్తించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆయన పేరును రాష్ట్ర సంయక్త కార్యదర్శిగా ప్రతిపాదించారు. దీంతో ఆయన పార్టీ అధిష్టానం నియమించారు. తనకు రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వటం పట్ల పోశం మధుసూధన రెడ్డి స్పందిస్తూ తనకు పదవి రావటానికి కృషి చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి తన వంతు శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర సంయక్త కార్యదర్శిగా ఎంపికయిన పోశం మధుసూధన రెడ్డికి మిత్రులు, బంధువులు, స్నేహితులు, పార్టీ బాధ్యుల నుండి అభినందనలు వెల్లువిరిసాయి.
