గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆర్ధికంగా దెబ్బ తిన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనించాలన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వ ధ్యేయం మన్నారు. మండల టీడీపీ ఆద్వర్యంలో మల్కాపురం, రజానగరం కుమ్మరి కాలనీల్లో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనాదక్షత వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేం దుకు అనేక కంపెనీలు ముందుకు వచ్చి ఓప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. కూటమి ప్రభుత్వ ఏమి చేయలేదని వైసీపీ మాట్లాడటం విడ్డూరంగా వుంద న్నారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఏడాది పాలనలో ప్రజలకే ఏమి చేశారో చెబుతారని అన్నారు.
కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు షేక్ కాశీంసైదా, టీడీపీరాష్ట్ర మైనారిటి సెల్ కార్యదర్శిషేక్ కాలేషావలి ( బడే ) ,క్లస్టర్ ఇంచార్జులు రాచకొండ వెంకట్రావు, కైపు నాగార్జునరెడ్డి, ఎస్.రామచంద్రారెడ్డి, వంగపల్లి బాపయ్య, అనపర్తి పెదదాసు, తుపాకులశ్రీను, పార్టీశ్రేణులు తదితరులుపాల్గొన్నారు.
