సత్వరమే బాధితులకు న్యాయం అందించటమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం -పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 94 ఫిర్యాదులు

ప్రజల నుండి వచ్చే వివిధ రకాల సమస్యల యొక్క ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఎ. ఆర్ దామోదర్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదుదారులతో పోలీస్ అధికారులు ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకుని ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అందిన ఫిర్యాదుల గురించి సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ వివాదాలు, జాబ్ ఫ్రాడ్, కుంటుంబ సమస్యలు, చీటింగ్ మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) నాగేశ్వర రావు, మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఎస్సీ/ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, డిటిసి ఇన్స్పెక్టర్ షమీముల్లా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *