ఒంగోలులో మూడవ పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు విజయవాడ బుక్ పెస్టివల్ సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శి లక్ష్మయ్య, మనోహర్ నాయుడు పేర్కొన్నారు. ఆగస్టు 15 నుండి 24వ తేదీ వరకు విజయవాడ బుక్ ఫెస్టివల్స్ సొసైటీ మరియు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ గ్రంథాలయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు దీనిలో భాగంగా పుస్తక మహోత్సవానికి సంబంధించిన గోడపత్రికను బుధవారం ఒంగోలు జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఆగస్టు 15 నుంచి 24వ తేదీ వరకు పుస్తక మహోత్సవాన్ని పివిఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మూడవ పుస్తక మమోత్సవాన్ని ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనలో ప్రముఖ పబ్లిషర్స్ వంద స్టాల్స్ వరకు ఏర్పాటు చేస్తారన్నారు. ప్రతిరోజూ సాయంత్రం సాహిత్య, సాంస్కృతిక విఙ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దీంతోపాటు సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుక్ రీడింగ్‌పై మక్కువ పెంచాలనే ఉద్దేశంతో ఈ పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గోడపత్రిక ఆవిష్కరణలో కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు నాయక్, కార్యదర్శి ఆర్ రామకృష్ణ ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అలుగుల సురేష్, తదితరులు పాల్గొన్నారు.

