40 ఏళ్ల దళిత ఉద్యమం కార్యాచరణపై ఈనెల 17న చీరాలలో జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చెయ్యాలని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దార అంజయ్య కోరారు. తాళ్లూరులో అంబేద్కర్ కమ్యూనిటీ బిల్డింగ్ వద్ద జరిగిన సమావేశంలో నిర్వహించారు. కారంచేడు ఉద్యమం జరిగి 40 ఏళ్లు నిండిన సందర్భంగా చీరాలలో కారంచేడు మృత వీరులకు విజయనగరం కాలనీలో నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం ఎన్బీఓ హెూమ్ నందు దళిత ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ పై సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.
