కాలుష్య ప్రభావం వలన వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయనివ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. మండలంలోని విఠలాపురం, మాధవరం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా కృషి చెయ్యాలని కోరారు. ఫెర్టిసైడ్స్, పురుగు మందుల పిచికారి తగ్గించాలని చెప్పారు. మొక్కలలో పైర్లలో జన్యు పరమైన లోపాలు వచ్చి దిగుబడులు మార్పులు వస్తున్నాయని అన్నారు. ఊహించని విధంగా చీడ లు వస్తున్నాయని చెప్పారు. మొక్కలను పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు. విఏఏ కె అశోక్, సుధీర్లు పాల్గొన్నారు.
