తాళ్లూరు మండలం శివరామపురం రీ నర్వే చేసిన లోపాలపై గ్రామ రైతుల ఫిర్యాదు మేరకు బుధవారం విచారణ నిర్వహించారు. జిల్లా రెవిన్యూ ఇన్స్ఫెక్టర్ పీవీ రమణ, డిప్యూటీ సర్వేయర్లు భాస్కర్, పరిశుద్ధ రావు, మండల సర్వేయర్ మహేష్ లు పాల్గొని విచారణ నిర్వహించారు. గతంలో గ్రామ నర్వేయర్, ఇన్చార్జి విఆర్డీగా పనిచేసిన చంధ్రశేఖర్ రెడ్డి రైతులకు విస్తీర్ణాల నమోదులో లోపాలు చేసారని, కేవలం కొంత మందిని ఇబ్బందులకు గురిచేసారని గ్రామ నాయకుడు కళ్యాణ్, మాజీ ఎంపీటీసీ లు లక్ష్మి నారాయణ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్ లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో కార్యాలయంలో విచారించగా తాను పని వత్తిడిలో రెండు గ్రామాలకు ఇన్చార్జి విఆరగా ఉండటంతో కొన్ని లోపాలు జరిగి ఉండవచ్చని ఇన్చార్జి విఆర్డీ అధికారులకు విన్నవించారు. పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని డీఐ పీవీ రమణ, డిప్యూటీ సర్వేయర్లు తెలిపారు.

