పేదలకు అండగా నిలుస్తున్న మానవత సేవా సంస్థ – నూతన కార్యవర్గం ఎన్నిక

సమాజంలో అనాథలు జీవించటమే కష్టంగా మారిన నేటి కాలంలో మృతి చెందిన సమయంలో వారి అంత్యక్రియలు నిర్వహించటం గురించి పట్టించుకునే వారే లేకపోతున్నారు. ఇలాంటి వారికి మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నారు. ‘మానవతా’ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు.
అనతికాలంలోనే చేరువ….
దర్శిలో ఏడాది క్రితం ప్రారంభమైన ఈ సంస్థ అన తికాలంలోనే పేద ప్రజలకు పలు విధాలుగా సాయం అందిస్తూ జులై 17న తొలి వార్షికోత్స వాన్ని చేసుకుంది. అనాథలకు చివరి మజిలీ గౌరవంగా సాగేలా సేవలు అందించటంతో పాటు అభాగ్యులకు, వ్యాధిగ్రస్తులకు ‘మేమున్నాం’ 608 అండగా నిలుస్తున్నారు. దాతల సాయంతో మూడు ప్రీజర్ బాక్స్లతో పాటు మృతదేహాలను తరలించేందుకు దర్శికి చెందిన దేవతి సోదరుల సాయంతో రూ. 9 లక్షల వ్యయంతో శాంతిరథం సంస్థకు చేకూరాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

670కి చేరిన సభ్యుల సంఖ్య

దర్శిలో గత ఏడాది జులై 16న 10 మంది సభ్యులతో ఈ సంస్థ ప్రారంభమైంది. వ్యాపారులు, ఉద్యోగులు, వివిధ వర్గాలకు చెందిన వారు సంస్థలో చేరటంతో అతి తక్కువ కాలంలో 670 మంది సభ్యులు సంస్థలో చేరారు. వీరు ఏడాదికి దాదాపు రూ.5 లక్షల వరకు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టేలా లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఎవరికైనా ఆపదవ చ్చినా, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా, కుటుంబ పోషణా కష్టంగా మారినా, చదువులకు, ఆనారో గ్యంతో ఇబ్బంది పడుతున్నా వీరి దృష్టికి వస్తే వెంటనే స్పందించి సాయం అందిస్తున్నారు.

దర్శికి సమీపంలోని వెంకటాచలం కొండకు సమీపులో కాశీనాయన ఆశ్రమంలో అనాథలుగా మృతి చెందిన నలుగురు వృద్ధులకు అంత్యక్రి యలు నిర్వహించి ఆఖరి మజిలీ గౌరవంగా సాగేలా చేశారు.దర్శి క్రిస్టియన్ పాలెం లో మృతి చెందిన కార్మికుని కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు. కొత్తపాలెంలో ఆటో డ్రైవర్ కుటుంబానికి సంస్థ దాతల సహకారంతో రూ. 11,058 సహాయం అందించారు. సమాజంలో ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో సంస్థ తరపున సాయం అందిస్తున్నట్లు సభ్యులు తెలిపారు.

ఘనంగా మానవతా సంస్థ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

దర్శి పట్టణంలో, గత సంవత్సరం మానవత స్వచ్ఛంద సేవాసంస్థను వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్.రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్థాపించారు. మొదటి వార్షికోత్సవం బుధవారం దర్శి మండల పరిషత్ కార్యాలయంలో అధ్యక్షుడు ధన రెడ్డి వెంకట రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ముఖ్య అతిధులుగా సీహెచ్సీ మెడికల్ అధికారి సుమన్ , మండల విద్యాశాఖ అధికారులు కాకర్ల రఘురామయ్య, బి రమాదేవి, ఆ సంస్థ జల్లా పరిశీలకులు యల మందారెడ్డి సంస్థను ద్దేశించి ప్రసంగించారు. కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డిని, జిల్లా డైరెక్టర్ గా ఎంపిక చేసారు.
నూతన కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్ గా దేవతి ప్రసాదు, కో చైర్మన్ వాకా జనార్ధన్ రెడ్డి, కన్వీనర్ దనిరెడ్డి వెంకటరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చీదెళ్ళ బసవయ్య, సహాధ్యక్షులు అడపాల గణేష్, ప్రధాన కార్యదర్శి గొర్రెపాటి వేణు,కోశాధికారి చింతా తిరుపతిరెడ్డి వున్నారు. గౌరవ అధ్యక్షుడిగా రాజేశ్వర్ రెడ్డి, ఈసీ మెంబర్లుగా కార్యవర్గ మస్తాన్,ఎన్వీ సుబ్బారెడ్డి, జే.సుశీలమ్మ,రోషారావు,వాసుదేవరెడ్డి,అన్నవరపు వెంకటేశ్వర్లు,మస్తాన్ నాయక్, మోషే,శేషారావు,ఎసెన్స్ సుబ్బారావు, కె. జైహింద్ రెడ్డి, లీగల్ అడ్వైజరీ కమిటీ చీఫ్ గడ్డి శ్రీనివాసులు(లాయర్),లు ఉన్నారు.
తదుపరి నూతన కార్యవర్గ సభ్యులచే సంస్థ పరిశీలకులు యల మందారెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముందుగా నటరాజ నృత్యకళా నిలయం వారిచే చిన్నారులచే సనాతన సాంప్రదాయాలను గౌరవిస్తూ కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి అందరినీ అలరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *