హైదరాబాద్ ఆగస్ట్ 1(జే ఎస్ డి ఎం న్యూస్):
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ గాది ప్రవీణ్ కుమార్ కు సీనియర్ న్యాయవాది బాచిన హనుమంతరావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాచిన హనుమంతరావు మాట్లాడుతూ న్యాయ రంగానికి వెలుగునిచ్చేలా ప్రవీణ్ కుమార్ పనిచేస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తనకంటూ ఒక ప్రత్యేకతను ఆయన సాధించుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న అని హనుమంతరావు తెలియజేశారు.
