తాళ్లూరు మండలంలో 90శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేసినట్లు ఇన్చార్జి ఎంపీడీఓ సానికొమ్ము సత్యం తెలిపారు. మండలంలో మొత్తం 6176 పెన్షన్లు ఉన్నాయన్నారు. నూతనంగా స్పౌత్జ్ పెన్షన్లు 116 మంజూరు అయినట్లు చెప్పారు. తాళ్లూరు, కొర్రపాటి వారి పాలెం, శివ రామ పురం గ్రామాలలో ఎంపీడీఓ పర్యటించారు. ఆయా కార్యక్రమాలలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, తాళ్లూరు యువ నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, కెవీ పాలెం సర్పంచి శ్రీదేవి, గ్రామ కార్యదర్శులు ఐవీ రమణా రెడ్డి, రవీంద్ర రెడ్డి, వేల్ఫేర్ అసిస్టెంట్స్ కోటి రెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు.

