శివరామపురం గ్రామానికి చెందిన అబోతు విమలమ్మ కు ఎస్సీ, ఎస్టీ కేసులో బాధితులకు ప్రభుత్వం నుండి రూ.9.50 లక్షలు నష్టపరిహారం మంజూరు అయినదని బాధితుల తరపున పోరాడిన దళిత నాయకులు నీలం నాగేంద్రం, దార అంజయ్యలు తెలిపారు. బాధితులతో కలసి శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ను బివి రమణా రావును కలిసి త్వరగా మంజూరు అయిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భూమి విషయంలో అదే గ్రామానికి చెందిన ఆలోకం హరిబాబు, చిన్నమ్మాయిలు విమలమ్మ పంటను నష్టపరచి, కులం పేరుతో దూషించారనే విషయమై మార్చి 2024న కేసు నమోదు అయినది. దీంతో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ క్రింద రూ.9.50 లక్షలు మంజూరు అయినది. జిల్లా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దార అంజయ్య, జనమాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
