చంద్రన్న ఉన్నంతవరకు రైతులకు భరోసా కల్పిస్తాం, ఇది మంచి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం కింద రైతులకు నగదు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లాలో ప్రారంభించారు. దర్శి మండలం వీరాయపాలెం గ్రామంలోని పొలాలలోనే రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. 46.85 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.3,174 కోట్లు నగదును జమా చేశారు. జిల్లాలో 2,68,165 రైతులకు రూ.122.74 కోట్లు, దర్శి నియోజకవర్గంలోని 42,871 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.29.06 కోట్ల నగదును పంపిణీ చేశామంటూ రైతులైన సుబ్బరత్తమ్మ, పేరయ్యలకు చెక్కు రూపంలో నగదును రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేశారు. దర్శి మండలంలో 10,987 మంది రైతులకు రూ.7.69 కోట్లు, తూర్పు వీరాయపాలెంలో 476 మంది రైతులకు రూ.7.20 కోట్లు నగదు ఇచ్చామన్నారు. ఉదయం 11:30 గంటలకు రైతుల వద్దకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు రెండు గంటలపాటు రైతులతో మండుటెండలోనే గడిపారు. వారణాసిలో పి ఎం కిసాన్ నగదు పంపిణీ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ హాజరు కాగా, ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులతో కలిసి నులక మంచాలపైనే కూర్చుని రాష్ట్ర ముఖ్యమంత్రి తిలకించారు.
వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉంది, ఏ పంట ఎక్కడ వేస్తే మంచి దిగుబడులు వస్తాయి, అనుకూలమైన ప్రాంతం, ఏ పంట వెయ్యాలి అనే అంశాలన్నీ సాంకేతికత ద్వారా మీతో వ్యవసాయం చేయిస్తానన్నారు. ప్రకృతి సేద్యంతో వచ్చే ఆహార ఉత్పత్తులన్ని వందేళ్ళ ఆయుష్ నిస్తుంది, దానికి నేను గ్యారెంటీ అంటూ రైతులకు భరోసా కల్పించారు. రైతులు క్షేమంగా ఉండాలి, వారు పండించిన పంటలకు మంచి గిట్టుబాటు ధరలు రావాలని ఆకాంక్షించారు.
అన్నదాత సుఖీభవ నాకెంత మేలు చేసింది. * 1.అనుష, మహిళా రైతు, శంకరాపురం ముండ్లమూరు మండలం.
నాకు మూడు ఎకరాల భూమి ఉంటే అందులో బొప్పాయి తోట వేశాను. ఎలాంటి పురుగు మందులు వాడకుండానే సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నాను… సార్, దర్శిలో స్టాల్ కూడా ఏర్పాటు చేశాను. చాలామంది రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నాను. ఇప్పుడు అన్నదాత సుఖీభవ నగదు వచ్చింది. పంటల పెట్టుబడికి నాకెంతో ప్రయోజనం కలుగుతుంది.
* “సీఎం”:- మీలాంటి రైతుల కొరకే అన్నదాత సుఖీభవ నగదు పంపిణీ చేస్తున్నాం. ప్రస్తుతం ఏ పథకాలు మీ ఇంట్లో వారికి వస్తున్నాయి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఎన్టీఆర్ పెన్షన్ వస్తుందా అని ప్రశ్నించారు. అవన్నీ వచ్చాయని చెప్పడంతో సూపర్ సిక్స్ పథకాలన్నీ పేదల సంక్షేమం కొరకేనని, సమర్థంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
నిరుద్యోగులకు స్థిరమైన ఉపాధికి ఇలాంటి చర్యలు తీసుకుంటారు.
*2. అనిల్ కుమార్ రైతు, తాళ్లూరు.
నేను డిగ్రీ చదువుకున్నాను. ఉద్యోగం దొరకకపోవడంతో మూడు ఎకరాలలో కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నాను. నాలాగే ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు. అలాంటివారికి ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పిస్తారా. మా గ్రామంలో చెరువు ఉంది, రహదారు లేక ఇబ్బందులు పడుతున్నాము.
*”సీఎం” :- మీలాంటి యువతకు ఇంటి వద్దనే ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నాం. ఇంటి వద్దనే వర్క్ ఫర్ హోమ్ విధానం వచ్చేసింది. పౌల్ట్రీలు, మేకలు, గొర్రెలు, గేదెలు వంటి యూనిట్ల స్థాపనతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇంటికి ఒకరిని ఆస్వాహిక పారిశ్రామికవేత్తలను చేయడం, ఒక కుటుంబానికి ఒక ఎం ఎస్ ఎం ఈ పెట్టాలనే యాచనలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ ప్రోడక్ట్ ఏపీలో ప్రవేశపెడుతున్నామన్నారు. తద్వారా యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఆ గ్రామాలను అనుసంధానిస్తూ రహదారులు నిర్మించాలని కలెక్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు.
వ్యవసాయం సులువుగా ఉండేలా యంత్రాలు ఇప్పించండి.
*3. అచ్చిరెడ్డి, రైతు, గట్టపాలెం.
*”సీఎం” :- జవాబుదారీతనంతో పాలన సాగిస్తున్నాం. వాట్సాప్ గవర్నమెంట్ ఏర్పాటు చేసాం, ఆగస్టు 15 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మీరు ఇంట్లోనే ఉండి ఏ పని కావాలో ఫోన్ లో క్లిక్ చేస్తే, తద్వారా ప్రభుత్వ సేవలు అన్ని పొందవచ్చు. మీ పొలాలలో పంటకు తెగులు వస్తే ఒక్క కాల్ చేయండి,… డ్రోన్ ద్వారా మీకు పురుగుమందులు పిచికారి చేయిస్తాం. అన్ని సేవలు వాట్సాప్ ద్వారానే మీరు పొందొచ్చు. ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్, మోటార్లు, తదితర యంత్రాలు, డ్రోన్లు తెప్పిస్తున్నాము. బిందు సేద్యం తొలిసారిగా ఏపీలో నేనే ప్రవేశపెట్టాను. రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. రైతుల ప్రయోజనం కొరకు మరింతగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యంత్రాలను అందుబాటులోకి తెస్తాము.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చం నాయుడు, 20 సూత్రాల ఏపీ చైర్మన్ లంకా దినకర్ బాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ లువివిధ శాఖల రాష్ట్ర, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.












