సీఎం చంద్రబాబు పర్యటన లో పాల్గొన్న జన ప్రభంజనానికి జేజేలు -డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

ప్రకాశం జిల్లా , దర్శి మండలం, తూర్పు వీరాయపాలెంలో శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి రైతులకు నేరుగా నగదు బదిలీ చేశారు. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఏడాదికి 20,000 ఇచ్చే అన్నదాత సుఖీభవ మొదటి విడత రూ. 7000 లను రైతులకు అందజేశారు. చంద్రబాబు పర్యటనలో పాల్గొన్న దర్శి ప్రాంత కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతాంగానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సీఎం రైతు రచ్చబండ కార్యక్రమం హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు, తదితర పనులలో నిమగ్నమై ఆయన పర్యటన ఆధ్యాంతం ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించిన పార్టీ క్యాడర్ కు, అదేవిధంగా ముఖ్యంగా పోలీస్, రెవిన్యూ, మున్సిపల్ శాఖలకు, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, విధ్యుత్, ఉద్యానవన, ఉపాధి హామీ, వైద్య ఆరోగ్య ఇంజనీరింగ్ అధికారులకు, వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి డాక్టర్ లక్ష్మీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారని “వెరీ గుడ్” “గుడ్ వర్క్” బాగా కష్టపడ్డారు అంటూ సీఎం చంద్రబాబు డాక్టర్ లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఉదయం 11 గంటలకు హెలిప్యాడ్ వద్దకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు.

ఈ సందర్భంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కే. అచ్చం నాయుడు , జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి , ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి , ఏపీ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ నూకసాని బాలాజీ , 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ , ఏపీఎస్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి , టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు , మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య , నియోజకవర్గంలో అన్ని మండల పార్టీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబుకు హెలిప్యాడ్ వద్ద సాదర స్వాగతం పలికారు.

అనంతరం తూర్పు వీరాయపాలెం పొలాలలో ఏర్పాటుచేసిన రైతు రచ్చబండలు దాదాపు రెండు గంటలకు పైగా నడి ఎండలో మండుటెండను సైతం లెక్కచేయకుండా సీఎం చంద్రబాబు రచ్చబండ లో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రసంగం అధ్యంతం విని ఆయన ఆ పథకం ప్రారంభించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులకు జోడించి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అన్నదాత సుఖీభవ నగదును రైతుల ఎకౌంట్లో జమ చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టి ప్రారంభించారు.

ఒక్క దర్శి నియోజకవర్గం లోని సుమారు 29 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసి చంద్రన్నను గొప్ప రైతు బాంధవుడుగా చెప్పవచ్చు. ఆ తర్వాత రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను రైతులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వివిధ సమస్యలను తెలియజేస్తూ, ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలను, కూటమి ఏడాది పాలనలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో చంద్రన్న పై రైతులు ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ సందర్భంగా తూర్పు వీరాయపాలెం కి చెందిన ఓ యువకుడు అడిగిన ఉల్లగల్లు టు తూర్పు వీరాయపాలెం రోడ్డును వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ని ఆదేశించారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రసంగం ఒంటిగంట నుండి దాదాపు రెండు గంటల వరకు సుదీర్ఘంగా రైతులను, ఈ ప్రాంత ప్రజలను ఎంతో ఉత్సాహపరిచే విధంగా సాగింది.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి దర్శికి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున దర్శి ప్రాంతం ప్రజలు స్వాగతం పలికారు. దర్శి అంతా పసుపు మయంగా మారింది, వీరాయపాలెం రోడ్డు కిటకిటలాడింది. తూర్పు వీరాయపాలెం రోడ్డు అంతా పచ్చ తోరణాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా దర్శి లో తెలుగుదేశం పండుగ జాతరల సాగింది. సీఎం చంద్రబాబు పర్యటనలో పాల్గొన్న అశేష ప్రజానీకానికి మరొక్కసారి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి , లలిత్ సాగర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *