బేగంపేట ఆగస్టు 8జే ఎస్ డి ఎం న్యూస్ :
శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సమిష్టి కృషి తో కలిసి నిర్వహించుకోవాలని స్థానికులు ఆలయ నిర్వహకులు నిర్ణయించారు. శుక్రవారం పాన్ బజార్లోశ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో చైర్మన్ మాకు ఎల్లేష్ ,మాజీ బోర్డు సభ్యులు మాజీ చైర్మన్ బొల్లు శ్రీనివాస్, సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు శ్రీకాల మనోజ్ కుమార్, ఆలయ ఈవో రవికాంత్ ఆలయ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని కృష్ణాష్టమి వేడుకలు సందర్భంగా ఆలయం లో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ ముదిరాజ్ సాయిబాబా మనోజ్ ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు.
