హైదరాబాద్. ఆగస్టు 8 జేఎస్ డిఎం న్యూస్:
.హైదరాబాద్ నగరంలో వర్షాల తో తలెత్తుతున్న ఇబ్బందులు, వరద సమస్యకు శాశ్వత పరిష్కారంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాల్లో మీరు నిలిచి ఉండకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎం ఏ ,యు డి హెచ్ ఎం డి ఏ ఏరియా సెక్రటరీ ఇలంబర్తి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఎం ఆర్ డి సి ఎల్ ఎండీ ఈవీ నర్సింహా రెడ్డి, జేఎండీ పి. గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


