సోదరికి ఎప్పటికి రక్షణగా ఉండాలని సోదరుడు, సోదరుడు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని సోదరి కోరుకుటుంటుంది అందుకు బంధంగా రక్షా బంధనం వేడుకగా జరుపుకుంటారు. మండలంలో శనివారం రక్షా బంధన్ ఘనంగా నిర్వహించారు. ఆత్మీయతకు, అనురాగానికి ప్రతీక అయిన రాఖీ పండుగ రోజు అక్కా చెల్లెమ్మలు, అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టి వారి ఆత్మీయ దీవేనలు అందించి పొందారు. రాఖీ పండుగ నాడు పలు కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం తాళ్లూరు మండలం తూర్పుగంగవరం, తురక పాలెం, రమణాల వారి పాలెం, కొర్రపాటి వారి పాలెం వచ్చిన వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి అక్కా చెల్లెమ్మలు ఎంతో అప్యాయంగా రాఖీలు కట్టారు. వారి చల్లని దీవేనలు అందించారు. ఆయా కార్యక్రమాలలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, ఐవీ సుబ్బా రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్ర సేనా రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్బీ వెంకటేశ్వర రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, యూత్, స్టూడెంట్, అధ్యక్షులు విష్ణు, శరత్, అశోక్ రెడ్డి, నర్పంచిలు కోట శివలక్ష్మి వెంకట రామి రెడ్డి, వలి, మాజీ సర్పంచి ఓబులు రెడ్డి, కొండారెడ్డి, గోపాల్ రెడ్డి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.




