నేడు జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం.జిల్లా వ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీని కార్యక్రమం

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ,ఆర్.బి.ఎస్.కె నోడల్ అధికారిడాక్టర్ భగీరధి ఆధ్వర్యములో జిల్లావ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ మంగళవారం పి.వి.ఆర్. హైస్కూల్ నందు మధ్యాహ్నం 12.30 నిమిషములకు 1 నుంచి 19 ఏళ్లలోపు వారికి ఉచితంగా మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లుజిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి
డాక్టర్ టి.వెంకటేశ్వర్లు తెలిపారు.పిల్లల ఆరోగ్యంపై నులి పురుగులు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని, అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతు న్నాయని చెప్పారు. వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహిస్తోందని అన్నారు. అందులో భాగంగా జిల్లాలోని ఒకటి నుంచి 19 సంవత్సరాల్లోపు వయస్సు కలిగిన 5,96,751 మంది పిల్లలు, యువకుల్లో నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయ నున్నట్లు తెలిపారు. ఏదైనా కారణంతో ఆ రోజు ఈ మాత్రలు వేసుకోకుండా మిగిలిపోయిన పిల్లలకు ఈ నెల 20వ తేదీన పంపిణీ చేస్తామని అన్నారు.నులి పురుగులతో ఆరోగ్య సమస్యలు ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లల్లో నులి పురు గుల సమస్య ఎక్కువగా ఉంటుందని, ఈ పురుగులు చిన్నారుల్లో రక్తహీనతకు దారి తీస్తాయని చెప్పారు. శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారతాయని అన్నారు . కడుపు లోపల చేరడం వలన నొప్పి, మంట, వికారం కలుగుతాయని అన్నారు. దీనివల్ల ఆహారం సహించదని, ఆకలి ఉండదని, .పిల్లలు నీరసపడతారని, శారీరక, మానసిక ఎదుగుదలలో లోపాలు కలిగి ఉంటారని , వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందని తెలిపారు. వాంతులు, మలంలో రక్తం, అతిసార వంటి సమస్యలు ప్రబలుతాయని అన్నారు. పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించని పిల్లల్లో నులి పురుగులతో పాటు ఏలిక పాములు, కొంకి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుందని అన్నారు.పిల్లల చేతి గోళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని, లేకుంటే వాటిల్లో పేరుకున్న మట్టి ద్వారా నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. కలుషిత నీరు, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనవల్ల నులి పురుగులు శరీరంలోకి చేరతాయని చెప్పారు. కూరగాయలను కడగకపోవటం, భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోకపోవటం, ఆహార పదార్థాలపై మూతలు లేకపోవటం వల్ల కూడా నులి పురుగులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఏడాది నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు ఆల్బెండజోల్ సగం మాత్ర (200 మిల్లీగ్రా ములు) నీళ్లలో కలిపి పట్టించాలని, 2 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 400 మిల్లీగ్రా ముల మాత్రను మధ్యాహ్నం భోజనం పూర్త య్యాక చప్పరించేలా చూడాలని, మాత్రను మింగకుండా పర్యవేక్షించాలని తెలిపారు. పాఠశాలల్లో అయితే బోధన సిబ్బంది, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలు అందించాలని అన్నారు.
పిల్లల్లో నులి పురుగులు, ఏలిక పాములు, కొంకి పురుగులు అనే మూడు రకాల పురుగులుండే అవ కాశం ఉంటుందని,.వీటి నిర్మూల నకు మధ్యాహ్నం భోజనం తరువాత ఆల్బెండజోల్ మాత్ర తీసుకోవాలని, శరీరంలో నులి పురుగులున్నట్టైతే మాత్రవేసుకున్న తరువాత ఒకటి రెండు రోజుల్లో మల విసర్జన ద్వారా బయటకు వెళ్తాయని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జ నలు చేయకూడదని, .మల విసర్జన తరువాత, భోజనా నికి ముందు చేతులను తప్పనిసరిగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఆ రోజు మాత్రలు మింగని వారి కోసం ఈ నెల 20న మాప్ అప్ స్పెషల్ డ్రైవ్ పెట్టి మాత్రలు వేసుకునేలా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *