2025-26 విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో ఎఫ్ ఏఎన్ ఏ పరీక్షల నిర్వహించుటకు
ప్రవేశ పెట్టిన నూతన మూల్యాంకణం ఉపాధ్యాయులను, విద్యార్థులను గందర గోళానికి తావు ఇస్తుందని ఎపీటీఎప్ తాళ్లూరు మండల ఉపాధ్యాయ సంఘం ఆరోపిస్తుంది. విద్యార్థులకు మొదటగా పరీక్షా పత్రాలలో పరీక్షలు నిర్వహించటం, తిరిగి అసెన్ మెంట్ బుక్స్లో జవాబులు రాయించటం, ఉపాధ్యాయుడు మూల్యాంకణ చేయటం, ఇతర సామర్థ్యాలను అంచనా వేసి మార్కులు వేయటం, అసెన్ మెంట్ బుక్లో బబిల్స్ దిద్దించటం, ఓఎంఆర్ సీట్స్ స్కాన్ చేయటం, మార్కులు ఆన్లైన్ లో నమోదు చేయటం, సీసీఈ మార్కుల రిజిస్టర్లో నమోదు పొగ్రెన్ కార్డులో నమోదు ఈ విధంగా తొమ్మిది రకాలుగా ఉపాధ్యాయుడు నమోదు చెయ్యాలంటే నమయం ఎంత వరకు నరిపోతుందో కేవలం రికార్డు వర్కే పరిమితం కావాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. కొండ నాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడిపోయిన చందగా పరీక్షల సంస్కరణ పేరుతో విద్యార్థుల చదువులకు మొదటికే మోసం వచ్చేలా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులకు కేవలం చదవటం, వ్రాయటం కూడ రాదని, ఇలా సమయం వృథా అయితే తమ పిల్లల చదువులు చట్టబండలే అని వారు వాపోతున్నారు. అందుకే ఇక నర్కార్ బడులలో చదువంటే ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ పునరాలోచించి ఉపాధ్యాయులను చదువులకే పరిమితం చెయ్యాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

