బెల్లంకొండ వారి పాలెంలో నిర్మిస్తున్న అంకమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి తన వంతు చేయూత అందిస్తానని వైసిపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. గారమంలోని ఎకలవ్య నగర్లో పార్టీ కార్యకర్త దేవర కొండ సుబ్బా రావు, సంతోషమ్మ ఆహ్వానం మేరకు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు కాలనీ వాసులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దేవాలయాన్ని పరిశీలించిన ఆయన తన వంతు చేయూత ఇస్తానని చెప్పారు. దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేసారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, పార్టీ శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు.

