మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలి.

మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేయూత ఇవ్వాలని వక్తలు అన్నారు. వికే ఉన్నత పాఠశాలలో బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఇన్చార్జి ప్రిన్సిపాల్ పై వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చటానికి పూనుగోవాలని హెడ్ కానిస్టేబుల్ పి ఏడుకొండలు, కానిస్టేబుల్ బ్రహ్మ నాయుడు కోరారు. చిన నాటి నుండే లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని, కుటుంబం ప్రాముఖ్యతను వివరించి, విద్యార్థులు బాధ్యతలు తెలుసుకుని సమాజంలో మన వంతు పాత్ర నిర్వహించాలని కోరారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పై వేణుగోపాల్, లెక్చరర్లు గురవయ్య, రాజశేఖర్, లక్ష్మయ్య, సాయి లక్ష్మి, లలితా బోస్, పార్వతి బాయ్ , సిబ్బంది బ్రహ్మా రెడ్డి, శేష గిరి, వెంకటేశ్వరరెడ్డి, సుబ్బరామయ్య, శ్యామ్సన్, జయపాల్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *