బొద్దికూరపాడు మోడల్ ప్రైమరీ ప్రాధమిక పాఠశాలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు
గురువారం ఘన సన్మానం నిర్వహించారు. విద్యార్థులకు గత ఎనిమిది సంవత్సరాలుగా ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులు శారదా దేవి, శేషు ల సేవలను వక్తలు కొనియాడారు. ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, హెచ్ఎం కె నుబ్రమణ్యం, ఎన్ఎంసీ చైర్మన్ గుజ్జుల శివా రెడ్డి, రిటైర్డు హెచ్ఎం ఎన్ అంజి రెడ్డి, ఉ పాధ్యాయులు బి వి ఎన్ శర్మ,, ఎం విజయ కుమారి, హరిత, రేవతి దేవిలు పాల్గొని ఘన సన్మానం చేసారు. సన్మాన గ్రహితలు శారదా దేవి, శేషులు విద్యార్థులకు అభ్యసన సామగ్రి నోట్ పుస్తకాలు, పెన్, పెన్సిల్లు అందించారు.
