79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమం, మరియు గ్రామ వాలంటీర. రాష్ట శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి,
జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్.పి ఎ.ఆర్. దామోదర్ లతో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసు వందనాన్ని స్వీకరించారు.
అనంతరం మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్చంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సంధర్భంగా మంత్రి డా. బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ… స్వాతంత్ర్య సమరయోధులకు నా నమస్సుమాంజలి మరియు అమర్ వీరులకు నా నివాళులు ఆర్పిస్తున్నానని తెలియచేస్తూ, ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగష్టు15వ తేదీన మనకు స్వాతంత్ర్యం సిద్దించిందన్నారు. అలాగే మనదేశ సరిహద్దులలో వారి జీవితాల్ని పణంగా పెట్టి మనల్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు, మాజీ సైనికులకు అందరికీ నమస్సుమాంజలులు తెలియజేస్తూ, అమరులైన సైనికులకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అంజలిఘటిస్తూ, ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేసిన మన సైనికులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి, హంగు, ఆర్భాటా ల్లేకుండా సమర్ధవంతమైన పారదర్సకమైన పాలన సాగించడానికి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను చేపట్టుచూ, పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, వరరుల సమర్ధ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ అనే నాలుగు అంశాలను ప్రధానంగా తీసుకుని ప్రతి జిల్లాలో 15 శాతం వృద్ది సాధించడమే లక్ష్యంగా ప్రణాలికలు రూపొందిస్తున్నట్లు మంత్రి డా. బాల వీరాంజనేయ స్వామి తెలుపుతూ, జిల్లా ప్రగతిపై సమగ్రంగా తన సందేశాన్ని వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు కీ.శే శ్రీ ప్రకాశం పంతులు మునిమనవడు సంతోష్ కుమార్, కీ.శే శ్రీ గన్నవరపు వందనం కుమారుడు భాస్కర్ రావు, కీ.శే శ్రీ కరవాది వెంకటేశ్వర్లు కుమార్తె సుబ్బలక్ష్మి, అల్లుడు శేషగిరి రావు, కీ.శే మాటుమడుగు సుబ్రహ్మణ్యం కుమార్తె దాసరి నాగ సులోచన లను మంత్రి డా. బాల వీరాంజనేయ స్వామి సన్మానించడం జరిగింది. అలాగే మాజీ సైనికులను మంత్రి డా. బాల వీరాంజనేయ స్వామి, సన్మానించడం జరిగింది.
ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు :
……………….
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీ రాజ్, సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ మరియు దాని అనుబంధ శాఖలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీ ఎస్ ఆర్ టి సి), ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ శకటాల ప్రదర్శనకు గాను వ్యవసాయ దాని అనుబంధ శాఖల శకటానికి మొదటి బహుమతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు సంక్షేమ శాఖల శకటాలకు సంయుక్తంగా రెండో బహుమతి, విద్యా శాఖ శకటానికి తృతీయ బహుమతి లభించగా, సంబందిత శాఖల అధికారులకు, మంత్రి మెమోంటోలను అందచేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు :
……………………………………
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఒంగోలు లోని డ్రీమ్స్ ఉన్నత పాఠశాల, గుంటూరు ఆక్స్ ఫోర్డ్ ఉన్నత పాఠశాల, జడ్పీహెచ్ఎస్ ఆలకూరపాడు, కేజీబీవీ బిట్రగుంట, సూర్య ఉన్నత పాఠశాల, సరస్వతి కాలేజీ, ఫేస్ కాలేజీ విద్యార్ధిని, విద్యార్ధులచే దేశభక్తి ఉట్టిపడేలా ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. డ్రీమ్స్ ఉన్నత పాఠశాల మరియు కేజీబీవీ బిట్రగుంట విద్యార్డుల ప్రదర్శనకు సంయుక్తంగా మొదటి బహుమతి, జడ్పిహెచ్ఎస్ ఆలకూరపాడు మరియు గుంటూరు ఆక్స్ ఫోర్డ్ ఉన్నత పాఠశాల విద్యార్ధుల ప్రదర్శనకు సంయుక్తంగా ద్వితీయ బహుమతి, సూర్య ఉన్నత పాఠశాల మరియు శ్రీ సరస్వతి కాలేజీ విద్యార్ధుల ప్రదర్శనకు సంయుక్తంగా తృతీయ బహుమతి లభించగా, ఫేస్ కాలేజీ విద్యార్ధుల ప్రదర్శనకు ప్రోత్సాహక బహుమతి లభించగా, సంబందిత పాఠశాలల ఉపాధ్యాయులకు, విద్యార్డులకు మంత్రి మెమోంటోలను అందచేశారు.
ఆకట్టుకున్న ప్రభుత్వ స్టాల్స్:
………………………………
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మెప్మా, ఆర్ డబ్ల్యూ ఎస్., మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, ఉద్యాన శాఖ, జల వనరుల శాఖ, మత్స్య శాఖ, అటవీ శాఖ, పరిశ్రమల శాఖ, మైన్స్, పశు సంవర్థక శాఖలు, ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు పై ప్రత్యేకంగా స్టాల్స్ ను ఏర్పాటు చేయడమైనది. ఈ స్టాల్స్ ఏర్పాటుకు గాను మైన్స్ శాఖ స్టాల్ కు మొదటి బహుమతి, పశు సంవర్ధక శాఖ స్టాల్ కు ద్వితీయ బహుమతి, మెప్మా శాఖకు తృతీయ బహుమతి లభించగా, సంబందిత శాఖల అధికారులకు, మంత్రి మెమోంటోలను అందచేశారు.
ప్రభుత్వ ఉధ్యోగులకు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు :
………………….
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి తమ విధుల పట్ల ఉత్తమ సేవలందించిన అధికారులకు, ఉద్యోగస్తులకు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులకు మొత్తం 465 మందికి ప్రశంసా పత్రాలను మంత్రి అందచేశారు.
ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, ఏపి మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఏపి మాల వెల్ఫేర్ కార్పోరేషన్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ డా. పెదపూడి విజయ కుమార్, ఒంగోలు పట్టణాభివృద్ది సంస్థ చైర్మన్ ఎస్.కె రియాజ్, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డా. కామేపల్లి సీతారామయ్య, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
































