సందడిగా’ ఎట్ హోం ‘ కార్యక్రమం నిర్వహణ

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ‘ ఎట్ హోం ‘ కార్యక్రమం సందడిగా జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం, ఎస్ ఎన్ పాడు, కనిగిరి శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, బి ఎన్ విజయకుమార్, డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డా పెదపూడి విజయకుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, పిడి సి సి బ్యాంకు చైర్మన్ డా కామేపల్లి సీతారామయ్య, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, దర్శి నియోజకవర్గం టిడిపి ఇంచార్జి డా గొట్టిపాటి లక్ష్మీ, ఎర్రగొండ పాలెం నియోజకవర్గం ఇంచార్జి ఎరిక్షన్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులను, అధికారులను జిల్లా కలెక్టర్ స్వయంగా పలకరించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మారి టైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ తో కలసి పాటలు పాడి ఉత్సాహపరిచారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా గడిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *