మహానుభావులు మనకు ప్రసాదించిన స్వేచ్చా వాయువులను స్వాతంత్ర్యం -జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మనం స్వతంత్ర్యం సాధించుకొని 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 79వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కలెక్టరేట్ సిబ్బందికి, ఇతర శాఖల సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నానన్నారు. ఎందరో త్యాగధనులు, అమర వీరుల త్యాగం వలన మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి అయిందని, ఈ 78 సంవత్సరాల కాలంలో మనమెంతో అభివృద్ధిని సాధించడం జరిగిందన్నారు. ఆనాడు ఆ మహానుభావులు మనకు ప్రసాదించిన స్వేచ్చా వాయువులను నిజం చేస్తూ మనమంతా ముందుకు పోతున్నామన్నారు. మరొక సారి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా మనమంతా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా పౌర సరఫరా అధికారి పద్మశ్రీ, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ భాషా, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *