బేగంపేట ఆగస్టు 15 జే ఎస్ డి ఎం న్యూస్ :
బేగంపేట పాటిగడ్డ కూడలి లో 79వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.సనత్ నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట నీలిమ ,విశాల్ సుధాం లు జాతీయ జెండాను ఆవిష్కరించి శాంతి కపోతాలను ఎగుర వేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి మహనీయుల త్యాగాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ వేడుకలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు.పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

