జిల్లాలో భూగర్భ జల మట్టం మరింత పెరిగేలా గ్రామ స్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, భూగర్భ, జల వనరుల శాఖ, డ్వామా, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆర్ డబ్ల్యూ ఎస్. అధికారులతో సమావేశమై జిల్లా లో గ్రామ స్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాలికలు రూపకల్పన పై సమీక్షింఛి తగు సూచనలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో భూగర్భ జలాలు పెరగడానికి గ్రామ స్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాలికలు రూపొందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖల అధికారులను, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సమన్వయం చేసుకొని 20 మీటర్ల కంటే ఎక్కువ భూగర్బ జల మట్టం ఉన్న గ్రామాల్లో మరియు 8 నుండి 20 మీటర్ల భూగర్బ జల మట్టం ఉన్న గ్రామాల్లో ఏ ఏ చర్యలు చేపడితే భూగర్భ జల మట్టం పెరిగే అవకాశం ఉంటుందో పరిశీలన చేసి వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జల వనరుల శాఖ, ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ ఎస్.ఈ లు వరలక్ష్మి, బాల శంకర రావు, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి శ్రీనివాస రావు, ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్, ఎపిఎంఐపి పిడి శ్రీనివాస రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
