తాళ్లూరు మండలంలోని పలు విద్యుత్ సబ్ స్టేషన్ల పరధిలో సోమవారం వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని తాళ్లూరు విద్యుత్ ఎఈ రామ క్రిష్ణా తెలిపారు. దొడ్డవరం, ఇలపావులూరు మధ్య విద్యుత్ లైన్స్ ఏర్పాటు కారణంగా గుళ్ళ పల్లి నుండి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని చెప్పారు. తాళ్లూరు, శివ రామ పురం, మాధవరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు శివరామపురం, కొర్రపాటి వారి పాలెం, తాళ్లూరు, విఠలాపురం, రజానగరం, మాధవరం, కొత్త పాలెం రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని చెప్పారు. ఆయా గ్రామాల రైతులకు ఆదివారం రాత్రి 7గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు వ్యవసాయ విద్యుత్ ఇవ్వనున్నట్లు చెప్పారు. కావున రైతులు విషయాన్ని గమనించి సోమవారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయా గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎఈ ఒక ప్రకటనలో కోరారు.
25న తాళ్లూరు మండలంలోని పలు విద్యుత్ సబ్ స్టేషన్ ల పరధిలో వ్యవసాయ విద్యుత్ సరఫరా కు అంతరాయం
24
Aug