తాళ్లూరు పోలీస్ స్టేషన్ ను అకస్మిక తనిఖీ నిర్వహించిన దర్శి డీఎస్పీ

తాళ్లూరు పోలీన్ స్టేషన్ ను ఆదివారం రాత్రి దర్శి డీఎస్పీ బి లక్ష్మి నారాయణ అకస్మిక
తనిఖీ నిర్వహించారు. పలు రికార్డులను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు వినాయక చవితి పండుగ, నిమర్జనాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. అందుకు వినాయక స్వామి విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్న వారు కమిటీగా ఏర్పడి అక్కడ విద్యుత్ తో పాటు ఇతర సౌకర్యాలను జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఉత్సవాలు ఏర్పాటుకు పోలీస్ శాఖ నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ లో సింగిల్ విండో పద్దతిలో పోలీన్ శాఖ అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. వెబ్ సైట్లో నమోదు చేసుకోలేని వారు నమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు. అనుమతులు, వెబ్ సైట్లో నమోదుకు స్టేషన్స్లో పూర్తిగా ఉచితమని చెప్పారు. పోలీన్ శాఖను దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత ఎస్సై తనిఖీ చేసి అనుమతులు ఇస్తారని తెలిపారు. పూర్తి సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని, పోలీన్ శాఖకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై మల్లిఖార్జున రావు, ఎస్పై మోహన రావు, భాస్కర్ రావు, సిబ్బంది ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
oplus_8388610

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *