ప్రతి సామాన్య రైతుకు యూరియా అందే విధంగా అర్హలైన రైతులకు ఎరువులు ఇవ్వాలని తహసీల్దార్ బివి రమణా రావు కోరారు. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో సోమవారం విత్తనాలు ఎరువులు, పురుగు మందుల డీలర్లకు అవగాహన సమావేశం వ్యవసాయాధికారి ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిధిగా తహసీల్దార్ బివి రమణా రావు, ఎఎస్సై మోహన రావులు పాల్గొన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. రైతులు అవసరమైన మేర మాత్రమే నిజమైన రైతులకు ఎరువులు అందించాలని చెప్పారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రవేట్ డీలర్ల వద్ద 755.1 మెట్రిక్ టన్నుల ఎరువులు ఉన్నాయని, ఆర్ బి కే ల ద్వారా ఇప్పటికే 92 టన్నులు సరఫరా చేసామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. కొందరు రైతులు ఒక డీలర్కి తెలియకుండా మరోక డీలర్ వద్ద అధిక మొత్తంలో యూరియా తీసుకుంటున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో డీలర్ల అసోషియేషన్ అధ్యక్షుడు జాష్టి వెంకట రావు, డీలర్లు పాలెం శ్రీనివాస రెడ్డి, యండ్ర పల్లి భాస్కర్ రెడ్డి, మారం సుబ్బా రావు , కె గురున్నాథం, మేడగం వెంకటేశ్వర రెడ్డి, నాగి రెడ్డి, హనుమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
