కిల్కారి కేంద్ర బృందం సభ్యులు అమిత్, కిరణ్, భూషణు గురువారం తాళ్లూరు పీహెచ్సీలో కిల్కారీ సేవలు అందుకుంటున్న వారి వివరాలను పరిశీలించారు. పీహెచ్సీ పరిధిలో గర్బిణిలకు, బాలింతలకు కిల్కారీ కార్యక్రమం ద్వారా అందిస్తున్న సేవలను పిహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజేయ్ యాదవ్ లు బృందానికి వివరించారు. గర్భిణి నాలుగు నెలల నుండి ఏడాది వరకు కిల్కారి కాల్స్ చేసి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరించటం జరుగుతుందని వైద్యాధికారి తెలిపారు. అందుకు ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్ 911600103660 నుండి కాల్స్ వస్తాయని చెప్పారు. ప్రతి గర్భిణీ, బాలింత ఈ నెంబర్ ను ఫీడ్ చేసుకునేలా ఆరోగ్య సిబ్బంది సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. ఫోన్ కాల్స్ విన్న వారిని పరిశీలించేందుకు క్షేత్ర స్థాయిలో మాధవరం, తాళ్లూరులో వెళ్లి గర్భిణీలతో మాట్లాడారు. కార్యక్రమంలో డీసీఎం రాజేశ్వరి, కిల్కారీ పీఓ రాజు, సీహెచ్ ఏవీ రమణమ్మ, పీహెచ్ఎన్ వై విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.
